రాష్ట్రపతితో టిడిపి నేతల బృందం భేటీ

ఇటీవలి పరిణామాలపై వినతిపత్రం సమర్పణ

రాష్ట్రంలో దమనకాండను వివరించామన్న బాబు

అరాచక పాలన  సాగుతోందన్న సోమిరెడ్డి

న్యూఢల్లీి,అక్టోబర్‌25 (జనంసాక్షి):

ఎపిలో అధికార దుర్వినియోగంతో పాటు, మాదకద్రవ్యాలకు అడ్డాగా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతల బృందం రాష్ట్రపతి రామ్‌నాత్‌ కోవింద్‌కు ఫిర్యాదు చేసింది. ఇటీవలి ఘటనల నేపథ్యంలో టిడిపి బృందం రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో ఘటనలపై రాష్ట్రపతికి టీడీపీ నేతల బృందం నివేదిక అందజేసింది. మాదక ద్రవ్యాలు, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యలయాలపై దాడులు, ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగం, వ్యవస్థల నిర్వీర్యం, కోర్టు ఆదేశాల ధిక్కరణ, ఆర్ధిక దివాళా, ప్రభుత్వానికి అధికార పార్టీకి పోలీసుల గులాంగిరి అంశాలపై రాష్ట్రపతికి టీడీపీ నేతల బృందం ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై దాడులు, అక్రమ కేసులు పెట్టి వేధించడాన్ని రాష్ట్రపతికి వివరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కుంటుపడిరదని, రాష్టాన్న్రి  గాడిలో పెట్టాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతికి టిడిపి నేతలు విజ్ఞప్తి చేశారు. టీడీపీ నేతలు యనమల రామకృష్ణుడు, కాలువ శ్రీనివాసులు, కేశినేని నాని, అచ్చెన్నాయుడు,ఎంపి రామ్మోమన్‌ నాయుడు రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. అనంతరం చంద్రబాబు విూడియాతో మాట్లాడుతూ ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామన్నారు. రాష్ట్రంలో ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆఫీసులు, నేతలపై దాడులు చేశారని, డీజీపీ, పోలీసులకు ఫోన్లు చేస్తే స్పందించరని మండిపడ్డారు. ఘటనాస్థలికి తాను వెళ్లేసరికి దాడి చేసినవారిని పోలీసులే పంపిస్తు న్నారని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమేనన్నారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్‌ దొరికినా ఏపీలో మూలాలున్నాయని ఆరోపించారు. ఏపీలో 23వేల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో రాజకీయ నాయకులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, సహజ వనరులను ఎక్కడికక్కడ దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్‌పై దాడులు చేసి ఇంటికి పంపించే వరకు ఊరుకోలేదన్నారు. రాష్ట్రంలో అన్ని రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు జరుగుతున్నా యన్నారు. తమపై దాడులు చేసి.. తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారన్నారు. టీడీపీ నేతలను అక్రమ కేసులతో వేధిస్తున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరోవైపు రాష్ట్ర పరిస్థితులు వివరించేందుకు ప్రధాని, హోం మంత్రిని టీడీపీ సమయం కోరినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే  రాష్ట్రం మత్తు పదార్థాల కేంద్రంగా మారిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. ప్రశ్నించే వారి పైన దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటి పోయాయని అన్నారు. న్యాయ వ్యవస్థపైనా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. సాధారణ పరిపాలన జరగటం లేదని విమర్శించారు. జగన్‌ పాలన వదిలేసి ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను, రాష్ట్ర ప్రజలను కాపాడాలని రాష్ట్రపతిని కోరామని తెలిపారు. రాష్ట్రం వల్లకాడుగా మారిందని సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.