రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీవర్షాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అకాల వర్షం కురిసింది. శ్రీకాళం, విజయనరం , ఉభయ గోదావరి జిల్లాలు , చిత్తూరు, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది.

విజయనగరం జిల్లాలో బలరాంపురం, గంట్యాడలో పిడుగుపడి ముగ్గురు గాయపడ్డారు. ఆదిలాబాద్‌ జిల్లాలో నెన్నెల మండలంలో ఆదురుగాలులు, భారావర్షంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

తిరుపతి, భద్రాచలం, విజయవాడల్లో తేలికపాటి వర్షాలు కురియగా, శ్రీకాకుళం జిల్లా సారవకోటలో భారీ వర్షం కురిసింది. పశ్చిమగోదావరి జిల్లాలో పిడుగుపడి వరి కుప్ప దగ్ధం కాగా, రూ. 1.75 లక్షల నష్టం వాటిల్లింది. మరోవైపు అకాల వరంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈదురు గాలులు, వర్షాల కారణంగా వందలాది ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లింది.