రాష్ట్రానికి వర్షసూచన
విశాఖ: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి చురుగ్గా కదులుతోంది. దీనికి తోడు పశ్చిమబెంగాల్‌కు సమీపంలో ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావం వల్ల ఉత్తర కోస్తా, తెలంగాణ జిల్లాల్లో పలు చోట్ల, రాయలసీమ, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వానలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్లు విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు సైతం కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.