రాష్ట్ర వ్యాప్తంగా ఘనమైన శ్రీరామనవమి వేడులు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడులు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాచలంతోపాటు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. భద్రాద్రి ఆయయంలోని మిథిలా స్టేడియంలో వైభవంగా జరగుతున్న కల్యాణ వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చారు. కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీసీతారాముల కల్యాణానికి లక్షకుపైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. విజయనగరం జిల్లా రామతీర్థలో సీతారాముల కల్యాణానికి పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. హైదరాబాద్‌లోని రామాలయాలు, హనుమాన్ మందిరాలతోపాటు ప్రముఖ ఆలయాలు రామయ్య పెళ్లి వేడుకలకు సిద్ధమయ్యాయి.