రాహుల్‌ నామినేషన్‌పై అభ్యంతరాలు

లక్నో,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. అమేథీలో దాఖలు చేసిన నామినేషన్‌ పత్రంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో రాహుల్‌ నామినేషన్‌ పత్రాల తనిఖీని ఆ నియోజకవర్గ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు. బ్రిటన్‌లో రిజిస్టర్‌ అయిన కంపెనీ ప్రకారం.. రాహుల్‌కు ఆ దేశ పౌరసత్వం ఉన్నట్లు తెలుస్తున్నదని, అంటే ఈ దేశంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ పౌరుడు కాదు అని, అందుకే ఆయన ఎన్నికలకు అనర్హుడు అంటూ న్యాయవాది రవిప్రకాశ్‌ ఆరోపించారు. రాహుల్‌ సమర్పించిన విద్యార్హత పత్రాల్లోనూ అనేక తప్పులు ఉన్నాయని, ఒరిజినల్‌ విద్యా పత్రాలను సమర్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు.