రాహుల్ గాంధీ బిగ్గెస్ట్ బఫూన్ : కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణకు అతిపెద్ద దరిద్రం కాంగ్రెస్ అని, 50 రోజుల్లో 100 సభలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీని రద్దు చేసిన అనంతరం సీఎం గవర్నర్ నరసింహన్‌కు కలిసారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఎవరి పీడ విరగడవుతుందో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. ప్రతిపక్షాలు తమ దరిదాపుల్లో కూడా లేవన్నారు. జరగబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 100పైగా స్థానాల్లో గెలుస్తుందని కేసీఆర్ ఆశాభవావం వ్యక్తం చేశారు. నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయని, డిసెంబర్‌లో ఫలితాలు వెలువడతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
కాగా అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని ఆమోదించిన గవర్నర్.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలని కేసీఆర్‌ను కోరారు. ఈ సాయంత్రం కేసీఆర్ గజ్వేల్‌కు చేరుకోనున్నారు. శుక్రవారం కోనాయపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. అనంతరం హుస్నాబాద్ బహిరంగ సభకు వెళ్లి ప్రచారం మొదలుపెట్టనున్నారు. జూన్ 2, 2014న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ్టికి ప్రభుత్వం ఏర్పడి 4సంవత్సరాల 3నెలల 4రోజులు అయింది.