రాహుల్ రాజకీయ నిరుద్యోగి
` మంత్రి కేటీఆర్ ` కేటీఆర్ ఎద్దేవా
` పీవీని ఘోరంగా అవమానించిన కాంగ్రెస్
` ఆయనకు టిక్కెట్ కూడా ఇవ్వలేదు
` భౌతిక కాయాన్ని కార్యాలయంలోకి రానివ్వలేదు
` రాహుల్, ప్రియాంకలు క్షమాపణలు చెప్పాలి
` మంత్రి కేటీఆర్ డిమాండ్
హైదరాబాద్(జనంసాక్షి): రాహుల్ గాంధీ ఉద్యమం చేశారా? ఉద్యోగం చేశారా..?, ఎన్నడూ ఉద్యమం చేయని రాహూల్ గాంధీ యువత గురించి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. రాహుల్ ఒక రాజకీయ నిరుద్యోగి. ఆయన ఉద్యోగం కోసం నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి చిచ్చుపెట్టాలని చూస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.పీవీ.నరసింహారావు పేరెత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేటీఆర్ జాతీయ విూడియాతో మాట్లాడుతూ..పీవీ లాంటి గొప్ప నాయకుడిని ఘోరంగా అవమానించిన పార్టీ కాంగ్రెస్ అన్నారు.. ప్రధానిగా పనిచేసిన నాయకుడికే పార్టీ టికెట్ కూడా ఇవ్వకుండా అవమానించలేదా.. అన్నారు. పీవీ పార్థీవదేహాన్ని ఏఐసీసీ కార్యాలయానికి రానివ్వకుండా అవమానించిన సంగతిని తెలంగాణ ప్రజలు మర్చిపోరన్నారు. దేశ నాయకుడికి ఢల్లీిలో మోమోరియల్ కూడా నిర్మించ కుండా అడ్డుకున్నది కాంగ్రెస్సేనని అన్నారు. పీవీ కుటుంబానికి కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం పీవీ నరసింహారావు శతజయంతి ఘనంగా జరిపింది.. గొప్పగా గౌరవించుకుంది. భారతరత్న ఇవ్వాలని కోరింది.. తీర్మానాలు చేసిందని చెప్పుకొచ్చారు. డొల్లమాటలు.. కల్లబొల్లి కబుర్లు తప్ప చిత్తశుద్ధి లేదు. కర్ణాటకలో 100 రోజుల్లో రెండున్నర లక్షల ఉద్యోగాల మాటిచ్చి.. ఆర్నెళ్లు గడుస్తున్నా ఒక్క నోటిఫికేషన్ దిక్కులేదు. తొమ్మిదన్నర ఏళ్లలో 1,60,083 ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత మాది. దమ్ముంటే కాంగ్రెస్ పాలిత రాష్టాల్ల్రో ఇంత కంటే ఎక్కువ ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు కాంగ్రెస్ పార్టీ చాలా అన్యాయం చేసిందని, ఆయనను తీవ్రంగా అవమానించిందని, ఈ చరిత్ర గురించి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీకి ఏ మాత్రం అవగాహన లేకపోవడం నిజంగా దురదృష్టకరమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆయన మనందరం అభిమానించే వ్యక్తి అని, భూమి పుత్రుడని, తన జీవితం అంతా కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేసిన అలాంటి మానవతామూర్తిని కాంగ్రెస్ పార్టీ దారుణంగా అవమానించిందని మంత్రి చెప్పారు.1996లో సిట్టింగ్ ప్రధానిగా ఉన్న పీవీ నర్సింహారావుకు ఎంపీ టికెట్ నిరాకరించి.. కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవమానించిందని మంత్రి తెలిపారు. పీవీ మరణించినప్పుడు కనీసం 24 అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోకి కూడా ఆయన భౌతిక కాయాన్ని అనుమతించకుండా అవమానించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఈ చరిత్ర గురించి ప్రియాంకాగాంధీకి అవగాహన లేకపోవడం దారుణమని అన్నారు. పీవీ కుటుంబానికి రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.