రీజినల్ రింగ్ రోడ్డు వల్ల పేద రైతులకు తీవ్ర అన్యాయం

 టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్
 నర్సాపూర్.  సెప్టెంబర్, 28,  ( జనం సాక్షి )
రీజినల్ రింగ్ రోడ్డు వల్ల పేద రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని  టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ అన్నారు.
  రెడ్డిపల్లి గ్రామంలో ఎమ్మెల్యేను మదన్ రెడ్డి ని గ్రామానికి చెందిన రైతులు కలిసారు.  ప్రభుత్వం బడా నాయకులకు మేలు జరిగే విధంగా రింగ్ రోడ్డు నక్షను మార్చారని వారు ఆవేదన వ్యక్తం  రెడ్డిపల్లి గ్రామంలో మొదటగా కాలేశ్వరం ప్రాజెక్టుకు అధిక భూములు కోల్పోయామని కరెంట్ హైటెన్షన్ వైర్లు లకు భూములు కోల్పోయామని మరియు కొండపోచమ్మ కాలువ మా ఊరు నుండి వెళ్లడం వల్ల భూములు కోల్పోతున్నామని అది కాకుండా ఇప్పుడు రింగ్ రోడ్డు మూలంగా పూర్తిస్థాయిలో భూమిని కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.ట్రిబులర్ రోడ్డు కోసం రెడ్డిపల్లి మీదుగా భూసేకరణకు అధికారులు మొదట అలైన్ మెంట్ ప్రతిపాదించారని, కొంతమంది నాయకుల భూములు కాపాడేందుకు అలైన్మెంట్ను మార్పు చేసి, కొత్తగా తయారు చేయడంతో రెడ్డిపల్లికి చెందిన చెరువు సగం పోతుందని, గ్రామానికి చెందిన సుమారు వంద మంది పేద రైతుల భూములు రోడ్డు నిర్మాణం కోసం కోల్పోయే ప్రమాదం ఉంద న్నారు. మొదటి అలైన్మెంట్ ప్రకారమే భూసే కరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. స్పీదించిన ఎమ్మెల్యే
 ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి దృష్టి కి  తీసుకెళ్లి భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే మదన్ రెడ్డి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో భూములు కోల్పోయిన రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.