రీడిజైనింగ్‌పై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదు: కడియం
వరంగల్,ఏప్రిల్7(జనంసాక్షి): కాంగ్రెస్ నేతలకు ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌పై మాట్లాడే అర్హతలేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. అవినీతి సొమ్ము కారణంగా జైళ్లకు వెల్లిన వారికి, ప్రజల తిరస్కరణకు గురయిన వారికి ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. వరంగల్ జిల్లా హన్మకొండ మండలం తిమ్మాపూర్‌లో మిషన్ కాకతీయ పనులను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌లతో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో చెరువులను విధ్వంసానికి గురిచేసిన వారు కూడా మాట్లాడడం దారుణమని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ చెరువుల పునరుద్దరణ కార్యక్రమం చేపట్టాక మిషన్ కాకతీయను ప్రపంచమంతా పరిశీలిస్తున్నదని, అద్భుతమైన ప్రశంసలు వస్తున్నాయని అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా గ్రామాల్లో తాగునీటి ఎద్దడిని నివారించవచ్చని ప్రతి ఒక్కరూ గమనించి తామూ అలాంటి ఆలోచన చేయాలని పలు రాష్టాల్రు ముందుకు వస్తున్నాయని మంత్రి అన్నారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌పై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ నేతలకు ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌పై మాట్లాడే అర్హతలేదు. ఇరిగేషన్‌లో అవినీతికి పాల్పడితే జైళ్ల పాలైనవాళ్లు.. కోర్టుల చుట్టూ తిరిగే కాంగ్రెస్ నేతలా మమ్మల్ని విమర్శించేదా అని మంత్రి దుయ్యబట్టారు.
మిషన్ భగీరథ కేసీఆర్ సృష్టిం చిన అద్భుత పథకమని, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. మిషన్ భగీరథలో ఇంటింటికీ తాగునీరు అందించేందుకు చేస్తున్న భగీరథ ప్రయత్నమని, దీనిని పూర్తి చేయకుంటే ఓట్లు అడగనని అన్న మొనగాడు కెసిఆర్ అని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన అనేక పథకాలు అసాధ్యమని అనుకున్నారని,కానీ అవి కార్యరూపం దాల్చడం, ఫలితాలనిస్తుండడంతో ఆశ్చర్యపోతున్నారని అన్నారు. గతం లో విూ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విూరేం చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని కాంగ్రెస్ నేతలను కడియం ప్రశ్నించారు.
జిల్లాలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు అందరూ కలిసిరావాలని అన్నారు. చెరువుల ఆయకట్టు, భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా చేపట్టిన మిషన్ కాకతీయతో ఊరికి జీవం పోస్తున్నాం. చెరువులు, కుంటలకు పునరుద్ధరణతో పూర్వవైభవం తీసుకొస్తాం అని పేర్కొన్నారు. గునీటి అవస్థలు తీర్చడానికి చేపట్టిన మిషన్ కాకతీయలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. చిన్ననీటి వనరులకు జీవం పోయాలనే ఉద్దేశం తో సీఎం కేసీఆర్ రైతుల భాగస్వామ్యంతో మిషన్ కాకతీయ పథకాన్ని ప్రారంభించారన్నారు.