రుద్రూర్ లో చర్చి నిర్మాణం? రాజకీయ లబ్ధి కోసమా? ప్రభుత్వలు ఇచ్చే పథకాల కోసమా?

రుద్రూర్(జనంసాక్షి): రుద్రూర్ మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా చర్చి నిర్మాణం చేయాలని ప్రయత్నాలు కొనసాగుతున్న ఏదో ఒక కారణం వల్ల ఆగిపోవటం జరుగుతుంది , ఐతే గత కొన్ని రోజుల నుండి
రుద్రూర్ లో చర్చి నిర్మాణం కోసం మంతనాలు జరుగుతున్నాయని అసలు రుద్రూర్ లో చర్చి నిర్మాణం కోసం ఎవరు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అని పలువురు చర్చించికుంటున్నారు, అసలు రుద్రూర్ లో ఎంత మంది క్రైస్తవులు ఉన్నారు, ఇతర మతాల నుండి కన్వేర్టెడ్ క్రైస్తవులు ఎంత మంది ఉన్నారు, వారికి అధికారికంగా సర్టిఫికెట్లు ఉన్నాయా అన్న చర్చ కూడా జరుగుతుంది. రుద్రూర్ లో చర్చి నిర్మాణం కోసం పర్మిషన్ ఉంది అని పలువురు వాదిస్తే , అసలు పర్మిషన్ ఉంటే చూపట్టాలి అంటూ పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈ చర్చి నిర్మాణం రాజకీయ లబ్ది కోసం అంటూ అనుమానం వ్యక్తం చేస్తే, మరి కొందరు ప్రభుత్వం ఇచ్చే పథకాల కోసమే అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా చర్చి నిర్మాణం రుద్రూర్ ప్రజల చేతుల్లోకి వెళ్లనుందా , లేదా ఇంకా ఏమైన జరగనుందో వేచి చూడాలి. ఈ విషయం పై భజరంగ్ దళ్ కార్యకర్త మరియు బిజెవైయం మండల అధ్యక్షుడు గణేష్ ఆశన్నల స్పందిస్తూ నిజంగా రుద్రూర్ మండల కేంద్రంలో నిజమైన క్రైస్తవులు ఉంటే వారి చర్చి నిర్మాణం కోసం అడ్డు పడమని , అలాకాకుండా రాజకీయ లబ్ధి కోసమో లేదా ప్రభుత్వల నుండి ఇచ్చే పథకాల కోసమో లేదా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా నిర్మాణలు జరిగితే
హిందు సంఘాలతో నిరసనలు చేస్తామని తెలిపారు