రూ.145 తగ్గిన బంగారం ధర

దిల్లీ: బంగారం ధర తగ్గుదల కొనసాగుతోంది. మంగళవారం పసిడి ధర మరింత తగ్గింది. రూ.145 తగ్గడంతో పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.34,080కి చేరింది. అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్‌ మందగించడంతో బంగారం ధర తగ్గుముఖం పట్టినట్లు బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు వెల్లడించాయి. పసిడి బాటలోనే వెండి పయనించింది.

పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్‌ లేకపోవడంతో వెండి ధర కూడా తగ్గింది. రూ.100 తగ్గడంతో కిలో వెండి రూ.41వేల మార్క్‌కు చేరింది. అటు అంతర్జాతీయంగాను పసిడి ధర తగ్గింది. న్యూయార్క్‌ మార్కెట్లో బంగారం ధర 0.01శాతం తగ్గడంతో ఔన్సు 1,308.70 డాలర్లు పలికింది.