రెవెన్యూ డివిజన్ ప్రకటన చేయకుంటే బీఆర్ఎస్ ను తరిమికొడుతాం :

బిజెపి

రెవెన్యూ డివిజన్ దీక్షల్లో బిజెపి నాయకులు..

చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 28 :ఎంతో చరిత్ర కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ ప్రకటన చేయకుంటే బిఆర్ఎస్ పార్టీ నేతలను ఈ ప్రాంతం నుండి తరిమి కొడతామని బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంతరెడ్డి లు అన్నారు. గురువారం చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకై జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న దీక్షలు 18వ రోజుకు చేరుకోగా ఈ దీక్షలో బిజెపి నాలుగు మండలాల నాయకులు కూర్చున్నారు. ఈ దీక్ష శిబిరానికి ముఖ్య అతిథులుగా హాజరైన దూది శ్రీకాంత్ రెడ్డి, ఆరుట్ల దశమంతరెడ్డి లు మాట్లాడుతూ.. నాడు వెట్టి చాకిరికి వ్యతిరేకంగా నిజాం రజాకార్లను తరిమికొట్టిన నేల చేర్యాల ప్రాంతమని గుర్తు చేశారు. తాలూకాగా, నియోజకవర్గ కేంద్రంగా వెలుగు వెలిగిన ప్రాంతం నేడు అస్తిత్వాన్ని కోల్పోయి అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకుల చేతిలో కుక్కలు చింపిన విస్తారు లాగా విడదీయబడి ఈ ప్రాంత ప్రజలకు కన్నీళ్లు మిగిల్చారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్థానికేతరుడైనా ఈ ప్రాంత ప్రజలు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ ప్రాంతానికి కబ్జాలు చేయడం తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలన్నారు. బిజెపి అధికారంలోకి రాగానే చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తామని తెలిపారు. జేఏసీ నిర్వహించే ప్రతి ఉద్యమంలో బిజెపి ముందుంటుందని పేర్కొన్నారు. ఈ దీక్షలో బిజెపి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్, మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు మాజీ ఎంపీపీ తోకల ఉమారాణి, బిజెపి రాష్ట్ర నాయకులు పోతిగంటి రాందాస్, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ బల్ల శ్రీనివాస్, బీజేవైఎం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బొంగోని సురేష్ గౌడ్, ఎస్టీ మోర్చా రాష్ట్ర నాయకుడు లక్ష్మణ్ నాయక్, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి నర్ర మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు కాశెట్టి పాండు, దండ్యాల వెంకట్ రెడ్డి, భిక్షపతి నాయక్, సీనియర్ నాయకుడు ముచెంతుల సిద్దారెడ్డి, వడ్లకొండ సంజీవులు, తౌట బాల్ రాజు, బద్దీపడగ శ్రీనివాస్ రెడ్డి, మాచర్ల ప్రవీణ్ గౌడ్, దండ్యాల లక్ష్మారెడ్డి, యామ శ్రీకాంత్, ఉట్లపల్లి సురేష్, మంచెర్ల గోపాల్ రెడ్డి, సనాది కరుణాకర్ తదితరులు కూర్చున్నారు. ఈకార్యక్రమంలో జేఏసీ చైర్మన్ రామగల్ల పరమేశ్వర్, కో చైర్మన్ పూర్మ ఆగం రెడ్డి, జేఏసీ డివిజన్ నాయకులు అందె అశోక్, గూడ రాజిరెడ్డి,మిట్టపల్లి నారాయణ రెడ్డి, తడక లింగం, బిజ్జ రాము, పోతుగంటి ప్రసాద్,తాడెం వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు.