రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలి
-కలెక్టర్ అమ్రాపాలి
వరంగల్ అర్బన్, సెప్టెంబర్ 7 (జనంసాక్షి):ఈనెల 15నుంచి మూడు నెలలపాటు జరిగే భూరికార్డుల ప్రక్షాళన పక్రియలో రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అమ్రాపాలి ఆదేశించారు. గురువారం రెవన్యూ వ్యవసాయ శాఖల అధికారుల సంయుక్త సమావేశంలో కలెక్టర్ అమ్రాపాలి మాట్లాడుతూ రెవెన్యూ గ్రామాల వారిగా రెవెన్యూ రికార్డులప్రక్షాళనలో బాగంగా మనవద్దనున్న సమాచారంతో గ్రామసభలు నిర్వహించి అభ్యంతరాలను స్వీకరించి అవసరమైతే ఇంటికి వెల్లి క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలసి ఉంటుందని దీనికి గాను రెవెన్యూ, వ్యవసాయశాఖ ఉద్యానవన శాఖల అధికారులతో బృందాలు ఏర్పాటు చేసినట్లు ఆబృందాలు పూర్తి స్థాయిలో పనిచేసి భూయజమానుల తుది నివేదికను గ్రామసభలలో ఉంచాలన్నారు. ఈ చర్యల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 2018-19 సంవత్సరంలో రైతులకు అందించనున్న పెట్టుబడి మొత్తం అసలైన లబ్దిదారులకు ఆందించడం తేలిక వుతుందన్నారు. ప్రభుత్వ నిబందనల ప్రకారం అనుగుణంగా ఎంపికైన గ్రామ మండల జిల్లా రాష్ట్ర రైతు సమన్వయ సమితీల ద్వారా రైతులందరి సమన్వయంతో క్రాప్ కాలనీల పద్దతిని పాటించడం ఉత్తమ మార్కెటింగ్ పద్దతులు పాటించడం కోసం కృషిచేయాలన్నారు. దీనికోసం రైతు సమన్వయ సమితిలకె ఎంపికైన వారికి అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో జెసి దయానంద్, డీఆర్‌ఓ కె శోభ, వ్యవసాయ అధికారులు ఉషా, కృష్ణారెడ్డిలతో పాటు వ్యవసాయ అదికారలుఉ పాల్గొన్నారు.