రేపు మడికొండలో కాంగ్రెస్ ధర్నా
వరంగల్ : కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 27న మడికొండలో ధర్నా, రాస్తారోకోలను నిర్వహించనున్నట్లు జిల్లా, గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి, తాడిశెట్టి విద్యాసాగర్ సంయుక్తంగా ఒక ప్రకనటలో తెలిపారు. ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు వి.హన్మంతరావు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.