రేపు హిందూ ఉత్సవ కమిటీ సమావేశం.
హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి బాల్ రెడ్డి.
తాండూరు అగస్టు 13(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ఆర్య వైశ్య కళ్యాణ మండపం లో ఆదివారం ఉదయం 11 గంటలకు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సభ్యులు నియామక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి బాల్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే వినాయక ఉత్సవాలను పురస్కరించుకు ని నూతన కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమానికి హిందూ బంధువులు సోదరులు ప్రముఖులు అందరూ ఆహ్వానితులే నని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.