రైతును రాజు చేయడమే ప్రభుత్వ ధ్యేయం: ధర్మారెడ్డి

వరంగల్‌ రూరల్‌,మే14(జ‌నం సాక్షి): రైతును రాజు చేయడమే ప్రభుత్వ ధ్యేయమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నడికూడ, పోచారం గ్రామాల్లో రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పలువురు రైతులకు నేరుగా చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యవసాయ భూమిపై రైతుకు సర్వ హక్కులు కల్పించేందుకు భూదస్త్రాల ప్రక్షాళన చేపట్టి ప్రక్షఞాళన చేసినట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హావిూలనే కాకుండా ఇవ్వని హావిూలను సైతం అమలు చేస్తున్నారన్నారు. నడికూడలో 950 మంది రైతులకు రూ.71 లక్షల విలువైన చెక్కులు, పోచారంలో 1,000 మంది రైతులకు రూ.65 లక్షల విలువగల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. జడ్పీటీసీ సభ్యురాలు కల్పనాదేవి, ఎంపీపీ సులోచన, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు చంద్రమౌళి, తహసీల్దార్‌ హరికృష్ణ, సర్పంచులు పద్మ, రమేష్‌, జిల్లా రైసస కన్వీనర్‌ భిక్షపతి, మండల కన్వీనర్‌ 
సాంబశిరెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
—————-