రైతుబంధు కోసం ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు

ఏర్పాట్లను సవిూక్షించిన కలెక్టర్‌ 
జయశంకర్‌ భూపాల్‌పల్లి,మే9(జ‌నం సాక్షి): స్పీకర్‌ మధుసూధనాచారి సొంత జిల్లా కావడంతో
రైతుబంధు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. ఈ మేరకు కలెక్టర్‌ అమేయ్‌ కుమార్‌ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇప్పటికే గ్రామాల వారీగా సమాచారం చేరవేశారు. స్పీకర్‌ మధుసూధనాచారి, మంత్రి చందూలాల్‌ తదితరులు ఆయా ప్రాంతాల్లో రిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. జిల్లా వ్యవసాయాధికారి(డీఏవో) అనురాధ, భూపాలపల్లి, ములుగు ఆర్డీవోలు వీరబ్రహ్మచారి, రమాదేవితోపాటు వ్యవసాయ సహాయ సంచాలకు(ఏడీఏ)లతో కలిసి కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు, పంటసాయం చెక్కులను పరిశీలించారు. పంట సాయం చెక్కులను పట్టాదారు పాసుపుస్తకంలో పొందుపర్చటంపై రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు.
గ్రామాల్లో రైతులకు చెక్కుల నంబర్లతో కూడిన స్లిప్‌లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.  పట్టాదారు పాసుపుస్తకాలు, పంట పెట్టుబడి సాయం చెక్కులను కలిపి ఒకేసారి రైతులకు పంపిణీ చేయటానికి రెడీ అయ్యారు. కొత్త పట్టాదారు పా సుపుస్తకాలు, పంట సాయం చెక్కుల పంపిణీ కా ర్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితుల జిల్లా, మండల, గ్రామ కోఆర్డినేటర్లకు ఆహ్వానపత్రికలు కూడా అందజేసారు. ఉదయం నుంచి ఆయా గ్రామంలో వీఆర్‌ఏల ద్వారా రైతులకు స్లిప్‌ల పంపిణీ జరగనుందని డీఏవో అనురాధ తెలిపారు.  పట్టాదారు పాసుపుస్తకాలు, పంట సాయం చెక్కుల పంపిణీ కోసం జిల్లాలోని 20 మండలాల్లో 84 బృందాలు పనిచేస్తాయి. పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 10 నుంచి 17వ తేదీ వర కు నిర్వహించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అయితే జిల్లాలోని మొగుళ్లపల్లి, మహాముత్తారం మండలంలో ఈ కార్యక్రమం 10 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించేలా అధికారులు ప్లాన్‌ చేశారు. జిల్లాలోని 20 మండలాల్లో మొత్తం 353 కేంద్రాల్లో 1.26లక్షల మంది రైతులకు అధికారులు పంపిణీ చేయనున్నారు.