రైతుబంధు పక్కా అమలుకు వరుస సవిూక్షలు

చెక్కుల పంపిణీ ఏర్పాట్లలో అధికారులు
జనగామ,మే7(జ‌నం సాక్షి): రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ.4 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నారు. పంట పెట్టుబడి పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రూపొందించారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, డాక్టర్‌ తాటికొండ రాజయ్య, కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, రెవెన్యూ, వ్యవసాయశాఖలు ప్రతిరోజు వారి నియోజకవర్గాల్లో సంచరిస్తూ సవిూక్షలు నిర్వహిస్తున్నారు. రైతు బంధు పథకం, పట్టాదార్‌ పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండుగలా, ఉత్సవంలా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని పిలుపునిస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అన్ని విధాలా తగు జాగ్రత్తలు చేపడుతున్నారు. నాటి పాలకులు వ్యవసాయం దండుగ అంటే.. నేడు సీఎం కేసీఆర్‌ అదే రంగాన్ని పండుగలా మార్చారని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు  అన్నారు.రైతాంగానికి ధైర్యం కల్పిస్తూ రైతుసంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకంఎలా అమలు కాబోతుందని దేశం మొత్తం తెలంగాణ వైపు  చూస్తుందన్నారు. 24 గంటల కరెంట్‌ ఇస్తూ వ్య వసాయరంగం మరింత వృద్ధి సాధించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈనెల 10 న ప్రారంభమయ్యే పెట్టుబడి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధు లు, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు విజయవంతం చేయాలని కోరారు.  తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు నిర్మిస్తున్నారన్నారు.మారుతున్న కాలనికి అనుగుణంగా రైతులు సాగులో ఆధునిక పద్ధతులు అవలంబించి అధికదిగుబడి సాధించాలన్నారు.  రైతులు పండించిన పంటలకు మద్దతు ధర అందించేందుకు రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేశామన్నారు. మెట్ట రైతులకు చేయూత నిచ్చేందుకు 80 నుంచి 90శాతం సబ్సిడీపై సూక్ష్మ నీటిపారుదల పరికరాలను అందిస్తున్నట్లు తెలిపారు. రైతుబంధు పథకం అమలుతో యావత్‌ భారతదేశం తెలంగాణవైపు చూస్తోందని, సబ్సిడీ యంత్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్‌ వ్యవసాయాన్ని రైతులు పండుగలాభావించేలా చేస్తున్నారని, రూ.1 7వేల కోట్లు రుణ మాఫీ చేసి రైతును రాజు చేసేందుకు పంట పెట్టుబడి ఇస్తున్నారని పేర్కొన్నారు.
——-