రైతులకు అండగా కార్యక్రమాలు 

అనంతపురం,మార్చి19(జ‌నంసాక్షి):నాణ్యమైన విత్తు రైతులకు అందించడమే మన విత్తన కేంద్రాల ప్రధాన ఉద్దేశమని వ్యవసాయశాఖ అధికారులు అన్నారు.   వచ్చే ఖరీఫ్‌కు వేరుసెనగ సేకరణ  లక్ష్యంగా ప్రణాళిక సిద్దం చేస్తోంది.  రానున్న ఖరీఫ్‌లో నవధాన్యాలు, సూక్ష్మపోషకాలు, యంత్రాలు రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. వ్యవసాయాధికారులు, మన విత్తన కేంద్రాల ప్రతినిధులు సమన్వయంతో పని చేస్తేనే లక్ష్యాన్ని సాధించవచ్చని వ్యవసాయ అధికారులు సూచించారు. ముందస్తుగా వేరుసెనగ విత్తనకాయలను సేకరించి  పెట్టుకున్నారు. ఏయే రైతు ఎన్ని హెక్టార్లలో వేరుసెనగ సాగు చేశారన్న వివరాలను సేకరించాలన్నారు. పంటకోత పూర్తి కాగానే కాయలను సేకరించాలని సూచించారు.
ఇదిలావుంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు రైతులకు అందించి అండగా నిలవాలని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం అధికారి సూచించారు. ప్రధానంగా నేలను, భూగర్భ జలాలను కాపాడుకుంటే అదే రైతులకు కొండంత బలమన్నారు. ప్రతి రైతులు భూసార పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏయే నేలలకు ఏయే ఏయే పంటలు వేసుకోవాలి. భూసార ఫలితాల ఆధారంగా ఎంత మోతాదులో ఎరువులు వేసుకోవాన్నది రైతులకు తెలియజేయాలన్నారు.