రైతులకు అందబాటులో యూరియా నిల్వలు

ఒడిసిఎంఎస్ జిల్లా చైర్మన్ గుగులోతు రామస్వామినాయక్,
ఖానాపురం జూలై 20జనం సాక్షి
 రైతులకు అందుబాటులో యూరియా నిల్వలు ఉన్నాయని వరంగల్ ఉమ్మడి జిల్లాఒడిసిఎంఎస్ జిల్లా చైర్మన్ గుగులోతురామస్వామినాయక్ తెలిపారు.ముందస్తు వర్షాలతో నియోజకవర్గ ప్రజలకు జీవనాధారమైన పాకాల సరస్సు నిండటంతో ముందస్తు వరి నాట్లకు వెళ్ళే ఆస్కారం ఉంది కాబట్టి రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం  పాలకవర్గం అధ్వర్యంలో ఖానాపురం మండల రైతాంగానికి వానాకాలం సీజన్ కు సరిపడ ఎరువులు నిల్వ ఉంచినట్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ &జిల్లా ఒడిసిఎంఎస్ చైర్మన్& తెలంగాణ మార్క్ పైడ్ రాష్ట్ర డైరెక్టర్ గుగులోతు రామస్వామి నాయక్ తెలిపారు.
ఈ సందర్భంగా చైర్మెన్ రామస్వామి నాయక్ బుధవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని యూరియా నిల్వలు ఉన్న గోదాములను వైస్ చైర్మన్
 వేణు కృష్ణ,సీఈవో ఆంజనేయులు,సోసైటి డైరెక్టర్లతో కలిసి గోదాం  నిల్వలను పరిశీలించారు. అనంతరం చైర్మెన్ మాట్లాడుతూ సీజన్ మొత్తం ఎరువులు అందుబాటులో ఉంటాయని అవసరంమేరకు తీసుకువెళ్లాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమం లో సొసైటీ వైస్ చైర్మన్ దేవినేని వేణుకృష్ణ,సీఈవో ఆంజనేయులు,డైరెక్టర్లు భూ షబోయిన రాజు, మేకల కుమారస్వామి,బుద్దే తిరుపతి, ధర్మారావుపేట సర్పంచ్ వెన్ను శృతి-పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.