రైతులకు భయభ్రాంతులకు గురి చేయడం సరైన పద్ధతి కాదు

ఝరాసంగం సెప్టెంబర్ 26 (జనం సాక్షి) రైతులకు భయభ్రాంతులకు గురి చేయడం సరైన పద్ధతి కాదు అని మొగుడం పల్లి ఆశష్ప అన్నారు. సోమవారం మండల పరిధిలోని చిలపల్లి తండా వివిధ భూనిర్వాసిత గ్రామాల్లో మొగుడంపల్లి ఆశప్ప రైతుల కు ధైర్యాన్నిస్తూ సమావేశం కావడం జరిగింది. ప్రభుత్వ అధికారులు ప్రైవేటు ఏజెంట్లుగా భూ సేకరణ విషయంలో వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ప్రజాస్వామ్య వ్యవస్థను తూట్లు పొడిచే విధంగా ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్నారు అన్నారు చట్టాలను అమలు చేయాలని తద్వారా రైతులకు చట్టం పరిధిలో రావలసినటువంటి చట్టబద్ధమైన న్యాయమైన నష్టపరిహారాన్ని హక్కులుగా అందిస్తే రైతులకు మేలు కానీ అధికారులు చట్టాన్ని అమలు చేయాలని ఆలోచించకపోవడం విడ్డూరంగా ఉంది అన్నారు. అధికారులు చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలనుకోవడం చట్టాన్ని అగౌరా వపరచడమే అంటూ ఆశప్ప వాపోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ భూనిర్వస్థిత గ్రామాల రైతులు పాల్గొన్నారు.