రైతులకు 2021 ఖరీఫ్ పంటల నష్టపరిహారాన్ని వెంటనే అందజేయాలి.

రైతులకు 2021 ఖరీఫ్ పంటల నష్టపరిహారాన్ని వెంటనే అందజేయాలి.యూత్ కాంగ్రెస్ నాయకులు.
కోటగిరి మార్చి 22వ జనం సాక్షి:-దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు బెదిరింపు రాజకీయం చేయడం సిగ్గు చేటని బాన్సువాడ నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు బిఅర్ఎస్ నాయకులపై ద్వజమెత్తారు.  మంగళవారం రోజున రేవంత్ రెడ్డి పై బిఅర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధ వారం యూత్ కాంగ్రెస్ నాయకులు పోతంగల్ మండల కేంద్రంలో భారీ ఎత్తున నిరసన తెలిపి బిఅర్ఎస్ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా పలువురు యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.ఈనెల 20 న హత్ సే హత్ జూడో కార్యక్రమంలో భాగంగా గత మూడు రోజులుగా కురుస్తున్నా ఆకాల వర్షానికి దెబ్బతిన్న పంటను పరిశీలించడానికి ఉమ్మడి కోటగిరి మండలా నికి రేవంత్ రెడ్డి వచ్చి సుంకినిలో దెబ్బతిన్న పంటను పరిశీలిస్తే బిఆర్ఎస్ నాయకులకు అంత హులుకు ఎందుకని ప్రశ్నించారు.గతంలో కానీ ప్రస్తుతం సుంకినిలో జరిగిన పంట నష్టం బిఆర్ఎస్ నాయకుల కు కనిపించకపోతే కంటి వెలుగు ప్రోగ్రాం ద్వారా కండ్ల జొడ్లు తెప్పించుకొని మరి పంట నష్టాన్ని చూడాలని ఎగ్దేవ చేశారు.టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు యూత్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు.ఈ విషయంపై ఎక్కడైనా ఇప్పుడైనా చర్చించడానికి బాన్సువాడ నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ నాయకులం సిద్ధంగా ఉన్నామని బిఆర్ఎస్ నాయకులకు సవాలు విసిరారు.2021 ఖరీఫ్ గాను ఉమ్మడి కోటగిరి మండలంలో 8 వేల ఎకరాలలో పంట నష్టం జరిగింది వాస్తవం కాదా అని ప్రశ్నించా రు.ఈ పంట నష్టం జరిగి 18 నెలలు కావస్తున్నా కూడా రైతులకు ఇప్పటివరకు ఎలాంటి నష్ట పరిహా రం ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు.బాన్సువాడ నియోజక వర్గంలో ప్రతి పల్లెపల్లె,వాడవాడ అభివృద్ధి జరిగిందని గొప్పలు చెప్పుకో వడంతో పాటుగా పోచారం వారి తనయులు గల్లి స్థాయి నాయకులు చేసే అవినీతిని కూడా చెప్తే బాగుంటుందన్నారు. రాబోయే రోజుల్లో యూత్ కాంగ్రెస్ తరపున బాన్సువాడ నియోజక వర్గ వ్యాప్తంగా బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రతి అవినీతిని ఎండగట్టి బాన్సువాడ గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగర వేస్తామని అన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలు తక్షణమే రైతులకు నష్టపరిహారం అందించి,ఏక కాలంలో లక్ష రూపాయ ల రైతు రుణమాఫీని అమలు చేయాలని  డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో రైతులకు అందే పలు ఇన్పుట్ సబ్సిడీలను కాలరాసిన బిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డా యన్నారు.ఈ సమావేశంలో బాన్సువాడ నియోజక వర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షు లు మధు సూదన్ రెడ్డి,బాన్సువాడ కౌన్సిలర్ రోహిత్,జిల్లా డెలిగేట్ సభ్యులు హనుమంతు,నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంధపురాజు,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మన్సూర్,పోతంగల్ గ్రామ యూత్ అధ్యక్షులు పి.సాయిలు,సోషల్ మీడియా కోఆర్డినేటర్ అభిషేక్,దత్తు,అజారుద్దీన్, మనోహర్,రాజేందర్,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.