రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని ధర్నా చేసిన గోపాల్ పేట కాంగ్రెస్ నాయకులు

గోపాల్ పేట్ జనం సాక్షి జూలై (29) గోపాల్ పేట్ గ్రామంలోని రైతుల  విద్యుత్తు సమస్యల ను పరిష్కరించాలని  గ్రామ రైతుల పక్షాన  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ ఆవరణలో ధర్నా  చేశారు ఈ సందర్భంగా గ్రామ  కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రమని గొప్పగా చెప్పుకుంటున్నా కేసిఆర్ కు సిగ్గుండాలని అన్నారు. రైతులను వెంటనే 24 గంటల కరెంట్ ఇవ్వాలని అలాగే రైతులకు ఉచిత ఎరువులు ఇవ్వాలన్నారు.రైతుల సమస్యలపై పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వారన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ శివన్న,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ కొంకి రమేష్,జనరల్ సెక్రెటరీ సుధాకర్ రావు,వార్డు మెంబర్ వెంకటయ్య,కాంగ్రెస్ నాయకులు దేవరాజు యాదవ్,లక్ష్మణ్,యువజన నాయకులు ప్రవీణ్,బాలకృష్ణ,బాలపీరు,బాలస్వామి,గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.