రైతులను ఆదుకోవాలి: దత్తాత్రేయ
హైదరాబాద్, జనంసాక్షి: రాష్ట్రంలో వడగళ్ల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను అదుకోవాలని బీజేపీ నేత దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఎకరానికి రూ. 15వేల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రైతుల దగ్గరకు వెళ్లి పరామర్శించే సాహసం సీఎంకు లేదని ఎద్దేవా చేశారు. ప్రజల బాధలు వదిలేసి పదవి కాపాడుకునేందుకు ఢీల్లీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.