రైతులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
చేసుకోవాలి….రైతులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి….
చిలప్ చేడ్/మర్చి/జనంసాక్షి :- మండలంలోని ఫైజాబాద్ గ్రామంలో వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతీ రైతు క్రాప్ లోన్ తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా వరి పొలాల్లో ప్రస్తుత దశలో అగ్గి తెగులు పంటకు సోకి అధికంగా నష్టాన్ని కలిగిస్తుందని గమనించామన్నారు. అగ్గి తెగులు సోకిన పొలాల్లో వరి ఆకులపై నూలు కండే ఆకారంలో మచ్చలు ఏర్పడి క్రమేణా పెద్దవై చివర్లో మొనదెలి ఉంటాయి, ఈ మచ్చలు ఒకదానితో ఒకటి కలిసి ముదిరిన గోధుమ రంగులో కి ఆకులు మారి ఎండిపోతాయి అని, అదేవిధంగా యూరియా అధికంగా వాడిన పొలాల్లో అగ్గి తెగులు సోకే అవకాశం ఉన్నందున ఈ లక్షణాలు ఉన్న పొలాలకు యూరియా వేయడం తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు. అగ్గితెగులు నివారణకు ట్రైసైక్లోజాల్ 0.6 గ్రా.మాన్కోజెబ్ 0.25 గ్రా. లేదా కాసుగా మైసిన్ 2.5 మి.లీ. లేదా ఐసొప్రోథయోలెన్ 1.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి అని తెలిపారు. అదేవిధంగా వరి పొలంలో నీరు ఆరుతు పారుతు ఉండే విధంగా చూసుకోవాలి అని అన్నారు. చిరు పొట్ట దశలో పొలాలకు వాటికి ఎకరానికి 20 కిలోల పొటాషియం చల్లుకోవాలి అని సూచించారు. పీఎం కిసాన్ ద్వారా రైతులకు వచ్చే డబ్బులు రావాలంటే తప్పకుండా EKYC చేయించుకోవాలని సూచించారు, EKYC చేసుకొని యెడల పీఎం కిసాన్ ద్వారా వచ్చు డబ్బులను కోల్పోవలసి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ భూపాల్ రైతులు శశికాంత్ ఎం.కె విట్టల్ శేషిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.