రైతులు రైతు భీమా,పిఎం కిసాన్ ఈకెవైసి చేసుకుంటేనే నగదు జమ.

నెరడిగొండ జులై (జనంసాక్షి):
రైతులు రైతు భీమా చేసుకొనుటకు చివరి తేదీ జులై31కలదు.పిఎం కిసాన్ పెట్టుబడి సహాయం కోసం ఈకెవైసి తప్పనిసరి చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి బిర్రు భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.అంతేకాకుండా గతంలో రైతు భీమా చేసుకున్న వారు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవచ్చు. అనివార్య కారణాల వల్ల రైతు చనిపోయినచో ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా 5లక్షలు రూపాయలు అందజేయడం జరుగుతుందని,పిఎం కిసాన్ నిదిని రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని.ఈ నెల 31 చివరి తేదీ.ఈకెవైసి చేయాలేని రైతులకు మోడీ డబ్బులు నగదు జమ కాదని,కావున ప్రతి ఒక్కరూ చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి బి భాస్కర్ పేర్కొన్నారు.