రైతుల్లో భరోసా కనిపిస్తోంది

గతంలో ఎప్పుడూ ఇలాంటి వాతావరణం లేదు: ముత్తిరెడ్డి
జనగామ,మే16(జ‌నం సాక్షి): రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు రైతు బంధు పథకం ద్వారా భూ రికార్డుల ప్రక్షాళనతో పాటు ప్రతీ రైతుకు ఎకరాకు రూ.8 వేలు అందిస్తున్న మహారాజు సీఎం కేసీఆర్‌ అని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. రైతు సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. గతవారం రోజులుగా గ్రామాల్లో జాతరలా కార్యక్రమం సాగుతోందని, రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోందని అన్నారు. ఇక తమకు పెట్టుబడిపై చింతలేదన్న భరోసాను వారు వ్యక్తం చేస్తున్నారని ముత్తిరెడ్డి అన్నారు. రైతుల కష్టాలు తెలిసిన గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని ఎమ్మెల్యేఅన్నారు. వ్యవసాయం దండుగ కాదని పండుగని తలపించే విధంగా రైతులకు పంట పెట్టుబడి సాయం రెండు పంటలకు ఎకరాకు రూ.8 వేలు సీఎం అందిసున్నారని అన్నారు. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో, ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారన్నా రు. నాణ్యమైన 24 గంటల విద్యుత్‌, ఎరువు లు, విత్తనాలు అందించడంతో పాటు రూ. లక్ష రుణమాఫి, భూ ప్రక్షాళన కోసం నూతన పాస్‌బుక్‌లు, ప్రకృతి వైపరిత్యాల వల్ల నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం, భూగర్భ జలాలు పెంచడం కోసం మిషన్‌ కాకతీయ వంటి కార్యక్రమాలు చేపడుతున్న సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాలన్నారు.ప్రతిపక్షాలు మతిభ్రమించి ఏమి మాట్లాడాలో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. వారు ఇప్పటికైనా విమర్శలు మానకుంటే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు.
———————