రైతుల అవసరాలకు 38టీఎంసీల నీటిని విడుదల చేయలని తెరాస డిమాండ్
హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లా రైతుల అవసరాలను తీర్చే మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకానికి 38టీఎంసీల నీటిని విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయాలని తెరాస డిమాండ్ చేసింది. ఆంధ్రాప్రాంతానికి నీళ్లు తగ్గుతాయనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగేలా కుట్రపన్నుతున్నారని విమర్శించారు. ఒక్క ఎంపీ రాజీనామా చేస్తానని బెదిరించడంతో శ్రీఖైలం ప్రాజెక్టుపై సీఎం స్పందించారని, తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ఆంధ్రాప్రాంత నేతల్ని చూసి నేర్చుకోవాలని హితవుపలికారు.