రోగులకు పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఖానాపూర్ నియోజకవర్గ ప్రతినిధి ఆగస్ట్ 19(జనం సాక్షి): స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ ధైర్యంగా ఉండాలని సూచించారు. ఆసుపత్రికి వస్తున్న వివిధ రకాల రోగులకు మెరుగైన చికిత్స అందిస్తూ వారికి ధైర్యాన్ని తెలుపాలని వైద్యులకు తెలియజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల శంకర్,వైస్ చైర్మన్ గొర్రె గంగాధర్,ఎంపీపీ మోహీద్ ,మున్సిపల్ వైస్ చైర్మన్ ఖలీల్, డిఅర్ బిఎస్ డైరెక్టర్ కోక్కుల ప్రదీప్, తెరాస మండల అధ్యక్షుడు రాజ్ గంగన్న నాయకులు పాల్గొన్నారు