రోడ్డు కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

 

బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : బజార్ హత్నూర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న వంతెన పనులు ఆలస్యం కావడంతో పక్కన తాత్కాలిక రోడ్డు బురదమై విద్యార్థులు ప్రయాణికులకు ఇబ్బందులు అవుతున్నాయని రొడ్ధు మరమ్మత్తు చేపట్టాలని బజార్‌ హత్నూర్ లో విద్యార్థులు ధర్నా నిర్వహించారు పాఠశాలకు గత పది రోజులుగా రెండు కిలోమీటర్ల మేరకు నడుచుకుంటూ వెళుతున్నామని తాత్కాలిక రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని విద్యార్థులు మండల వాసులు ధర్నా నిర్వహించారు స్పందించి దిగొచ్చిన యంత్రాంగం పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్
అట్లాగే పరిష్కారం దిశగా కృషి చేసిన పోలీస్ సిబ్బందికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థులకు మద్దతుగా వైస్ ఎంపిపి పోరెడ్డి శ్రీనివాస్ బుతాయి బీ సర్పంచ్ ఫడ్ జ్ఞానేశ్వర్ బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ గాజుల రాకేష్, బీజేవైఎం మండల అధ్యక్షులు సుధాకర్ నాయకులు జ్ఞానేశ్వర్ పాక్స్ డైరెక్టర్ లింగన్న తదితరులు ఉన్నారు