రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం
జనం సాక్షి క్రైమ్ న్యూస్ ఆగస్టు:-09
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవే-44 పై మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద రోడ్డుపై కంటైనర్, బైకునుఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడిక్కడే మరణించారు. మృతులు ఆర్మూర్ మండలం పెర్కిట్ కు చెందిన వారుగా గుర్తించారు. గౌతం, విగ్నేష్ ఇద్దరు బైక్ పై పెర్కిట్ నుండి నిర్మల్ వైపు వెళ్తుండగా
ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
స్థానిక ఎస్ఐ జి.శ్రీనివాస్ యాదవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీలను ఆస్పత్రికి
తరలించారు.