రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
వరంగల్: జిల్లాలోని లింగాలఘనపూర్ మండలం కల్లెంవాడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన బైక్ చెట్టును ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుడు జీడికల్‌కు చెందిన పూజారి పవన్‌కుమార్ చారిగా గుర్తించారు.