రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కురవి: వరంగల్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లెలో 365 జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. రహదారి ప్రక్కన నిలిపి ఉంచిన ఓ ప్రొక్లెయినర్ ను వేగంగా వచ్చి అదుపు తప్పిన ఓ ట్రాలీ ఆటో ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ట్రాలీ ఆటో నడుపుతున్న తోట వెంకన్న(36) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.