రోడ్డు ప్రమాద బాధితునికీ జెడ్పిటిసి ఆర్ధిక సహాయం
శివ్వంపేట ఆగస్ట్ 31 జనంసాక్షి : మండల కేంద్రమైన శివ్వంపేట గ్రామానికి చెందిన ముద్దగల అంజయ్య కుమారుడు శ్రీకాంత్ ప్రమాద వశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదం లో అతడికి తీవ్ర గాయలు అయ్యాయి. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న జడ్పీటీసీ పబ్బా మహేశ్ గుప్తా బుధవారం బాధితుడిని పరామర్శించి, 5 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సమయం లో జడ్పిటిసి వెంట ఉప సర్పంచ్ పద్మా వెంకటేష్, గ్రామ కమిటీ అధ్యక్షులు ముద్దగాల లక్ష్మీ నరసయ్య, వార్డు మెంబర్ పోచ గౌడ్, జ్యోతి బలేష్, జ్యోతి సింహం, నాయకులు దొడ్ల అశోక్, ఖదీర్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు రవి నాయక్, రాజు సాయి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.




