రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం.
ఫోటో రైటప్: నగదు అందజేస్తున్న ట్రస్ట్ సభ్యులు.
బెల్లంపల్లి, ఆగస్టు10, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రానికి చెందిన బూరం స్వాతి ఫార్మా ప్రవేశ పరీక్ష రాయడానికి వెళ్తుండగా మార్గమధ్యంలో కారుబోల్తా పడి తలకు తీవ్ర గాయలై నిమ్స్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న విషయం విదితమే. నిరుపేద కుటుంబం కావడంతో శాస్త్ర చికిత్సకు దాదాపు ఎనిమిది లక్షలు ఖర్చు అవుతాయని తెలపడంతో స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రూ. నాలుగు లక్షల ఎల్ఓసి మంజూరు చేయగా, గ్రామస్థులు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు సాయంతో చికిత్స కొనసాగుతోంది. చేతిలో చిల్లిగవ్వ లేక నిరాశగా ఎదురుచూస్తున్న విషయం తెలుసుకున్న ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు బుధవారం వైద్య ఖర్చుల నిమిత్తం రూ. పదివేలు అందజేశారు. దేవుని ఆశీస్సులతో త్వరగా కోలుకొని ఇంటికి చేరుకోవాలని కోరుకున్నారు. ఇంకా ఎవరైనా దాతలు నిండు మనసుతో ఆర్థిక సాయం చేయాలని బాధిత పేద కుటుంబం వేడుకుంటుంది. ఆర్థిక సాయం అందించిన వారిలో ట్రస్ట్ సభ్యులు దుర్గం ప్రేమ్ కుమార్, వెంకటస్వామి, బండారి భూమేష్, జెట్టి శ్రీనివాస్ ఉన్నారు.