ర్యాలీని విజయవంతం చేయండి

మందమర్రి సిఐ ప్రమోద్ రావు

 

రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయ గణపతి దేవాలయంలో మందమర్రి సిఐ ఆధ్వర్యంలో మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మందమర్రి సిఐ ప్రమోద్ రావు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రామకృష్ణాపూర్ లోని వివిధ పాఠశాలల విద్యార్థులత, కుల సంఘాలతో, స్వచ్ఛంద సంస్థలత, వ్యాపారస్తులతో, వివిధ రాజకీయ పార్టీల తో సుమారు ఐదువేల మందితో ఆగస్టు 13న భారీ ర్యాలీ, 16 న జాతీయ గీతాలాపన నిర్వహించనున్నట్లు తెలిపారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పాలకవర్గం, వివిధ పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులతో రాజీవ్ చౌక్ లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ ఐక్యంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సై బి అశోక్, మునిసిపల్ చైర్మన్ జంగం కల, వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.