రౖలు ఢీకొని మూడు ఎలుగుబంట్లు మృతి

నల్లగొండ: జిల్లాలోని భువనగిరి మండలం రాయగిరి-ముత్తిరెడ్డిగూడెం మధ్య ఉదయం గౌతమి ఎక్స్‌ప్రెస్‌ ఢీ కొని మూడు ఎలుగుబంట్లు మృతి చెందాయి. డ్రైవర్‌ దీనిని భువనగిరి రైల్వేస్టేషన్‌లో నిలిపివేసి అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఘటనస్థలికి చేరుకొని పరిశీలించారు. దీంతో అరగంటలకు పైగా భువనగిరిలో నిలిచిపోయింది.