లభ్యమైన ఇంటర్ విద్యార్థి ఆచూకీ
నిజామాబాద్: కామారెడ్డి పట్టణానికి చెందిన ఇంటర్ విద్యార్థిని కీర్తన (17) ఆచూకీ ముంబయిలో లభ్యమైనట్లు సమాచారం. దీంతో పోలీసులు, తల్లిదండ్రులు ముంబయికి బయలుదేరి వెళ్లారు. పట్టణంలో విద్యానగర్ కాలనీకి చెందిన కీర్తన హైదరాబాద్ నిజాంపేటలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఆదివారం ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలు విడుదలైన తర్వాత మరో అమ్మాయితో కలిసి కామారెడ్డికి బయలుదేరింది. అయితే కీర్తన ఇంటికి చేరుకోకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.