లాభాలు కెసిఆర్ జేబులకెల్లి రాలేదు! ……………………………. జనక్ ప్రసాద్……………………….కార్మికులు కష్టపడి లాభాలు తెస్తే కేసీఆర్ తన జేబులో నుండి అప్పనంగా ఇచ్చినట్టు ప్రకటన చేస్తున్నారు .
సిఎస్ఆర్ , డిఎంఎఫ్టీ నిదులంటూ వేల కోట్లు కార్మికుల సొమ్ము వాడుకున్న ఈ ప్రభుత్వం కార్మికులను పట్టిచుకున్న పాపాన పోలేదు .
యాజమాన్యం కార్మికులకు చెల్లించాల్సిన ఏరియల్స్ వెంటనే చెల్లించాలని జనక్ ప్రసాద్ డిమాండ్ చేసారు.
ఐఎన్ టీ యుసి సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ గేట్ మీటింగ్లో ముఖ్యఅతిథిగా విచ్చేసిన జేబీసీసీఐ శాశ్వత సభ్యులు ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ
కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం లాభాల్లో నడిచే సింగరేణి సంస్థ ను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దానికి సహకరిస్తుందని ఎనిమిది ఏళ్లు మోడీ ప్రభుత్వానికి అంటకాగిన కెసిఆర్ ప్రభుత్వం ఇప్పుడు దొంగ పోరాటాలు చేస్తున్నారరని అన్నారు .
టీబీజీకేఎస్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మారు పేర్ల మార్పు , కొత్త బొగ్గు గనులు , నూతన రిక్రూట్మెంట్ , పదివేల నూతన క్వాటర్ల నిర్మాణం ఎటు పోయాయి అని ఎద్దేవా చేశారు .
సింగరేణి ప్రైవేటీకరణ పైన అంతా చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక తీర్మానం చేయించాలని అన్నారు .
ఐఎన్ టియుసి గుర్తింపు సంఘంగా ఉన్నపుడు 18 మ్యాన్ రైడింగ్ సిస్టమ్స్ తెచ్చాం అని , కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం చేశామని , 24000 మందికి ప్రమోషన్లు ఇప్పించామని గుర్తు చేశారు .
సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగి అమాయక ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు . అధికారులు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారని వారికి రాబోయే రోజుల్లో తగిన బుద్ది చెప్తాం అని అన్నారు .
కార్మికులకు చెల్లించాల్సిన ఎరియల్స్ సెప్టెంబర్ లో నెలలో చెల్లించాలని పై ఇప్పటివరకు టీబీజీకేఎస్ ఎందుకు నోరు విప్పడం లేదని అదేవిధంగా సింగరేణి కార్మికులకు రావాల్సిన లాభాల వాటా ఉసే ఎత్తడం లేదని దీనిపై కార్మికులు ఆలోచన చేయాలని దీనిపై గుర్తింపు సంఘం అని చెప్పుకు తిరుగుతున్న నేతలు కార్మికులకు సమాధానం చెప్పాలని.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఐఎన్టీయూసీ గుర్తింపు సంఘంగా ఏర్పడితే పెర్క్స్ పై ఇన్కంటాక్స్ యాజమాన్యమే చెల్లించేలా చేసి మారుపేర్ల మార్పు 6 నెలలో అమలు అయ్యేలా చేస్తాం అని.
సింగరేణి ప్రాంతంలో నివసించే కార్మికుల బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకపోగా కనీసం సబ్సిడీలు ఇచ్చి పరిశ్రమలను నెలకొల్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాకాలు ఇచ్చిందా అని కార్మికులు ఆలోచన చేయాలని . ఎమ్మెల్యే లకు నెల నెల రెండు కోట్లు ఇస్తున్నారు గాని కార్మికుల సంక్షేమం కోసం కనీసం మంచి నీరు ఇవ్వలేని దౌర్భాగ్యం ఏమిటని ప్రశ్నించారు.