లారీని ఢీకొట్టిన ఇన్నోవా
ఆరుగురికి తీవ్ర గాయాలు
సూర్యాపేట,మే29(జనం సాక్షి ): సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట దగ్గర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. హైదరాబాద్‌లో పెళ్లి బట్టల షాపింగ్ చేసుకుని ఇన్నోవాలో తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దూరకుంట దగ్గర ఆగి ఉన్న లారీని ఇన్నోవా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందిలో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలం వద్ద ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్ ఉంది. సరుకు అన్‌లోడింగ్ కోసం పది లారీలు వరుసగా ఆగి ఉన్నాయి. దీన్ని గమనించిన కారు డ్రైవర్ లారీలో రెండింటిని వెనుక నుంచి ఢీకొట్టి,ఆ తరువాత మూడో లారీని బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇన్నోవా నుజ్జునజ్జు అయిపోగా, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు గాయపడ్డారు.