లారీ ఢీకొని ఐదుగురి మృతి

తిరుమలాయపాలెం , జనంసాక్షి: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామం వద్ద శుక్రవారం  జరిగిన రోడ్డుప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతిల్లో నలుగురు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. వీరంతో ఒకే కుటుంబానికి చెందినవారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బీరోలు గ్రామానికి  చెందిన వీరంతా ఆటోలో ఖమ్మం వస్తుండగా దమ్మాయిగూడెం వద్ద వరంగల్‌ వైపు వెళ్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ఒక బాలుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ ఖమ్మంలో చికిత్స పొందుతూ మృతి చెందింది.