లైన్స్ క్లబ్ తాండూర్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్స:

అంధకారంతో బాధపడుతున్న వృద్దులకు
తాండూరు లైన్స్ క్లబ్ అండ..
తాండూరు అగస్టు 18(జనంసాక్షి)
వికారాబాద్ జిల్లా తాండూర్ లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో వృద్దులకు ఉచిత కంటి చికిత్స కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే సదరం కంటి ఆస్పత్రి హైదరాబాద్ వారి సౌజన్యంతో ప్రతి 15 రోజులకు ఒకసారి ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది..ఈ సందర్భంగా బుధవారం కూడా తాండూరు పట్టణం నుండి 16 మంది ఔట్ పేషెంట్ కు కంటి చికిత్సలు నిర్వహించడం జరిగిందని లైన్స్ క్లబ్
సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా తాండూరు లైన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ అంధకారం తో బాధపడుతున్న వృద్ధులకు ఉచితంగా లైన్స్ క్లబ్ తాండూర్ వారి ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహించి ఎలాంటి రుసుము తీసుకోకుండా వారికి తగిన చికిత్స నిర్వహించి తీసుకురావడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జహీర్ అహ్మద్, సెక్రటరీ రొంపల్లి సంతోష్ కుమార్, ట్రెసరెర్ యూసఫ్, సీనియర్ సభ్యులు సల్ల దామోదర్, ఓం ప్రకాష్ సోమని, రామానుజ సోనీ, జయ శ్రీ దీవాటే, వీరా ప్రసాద్,పాల్గొన్నారు.