లోక్‌పాల్‌ ఆలస్యంపై అన్నా మండిపాటు

2న దీక్ష చేపడానని ప్రకటన
ప్రధాని మోడీకి లేఖ
న్యూఢిల్లీ,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): లోక్‌పాల్‌ను నియమించడంలో కేంద్రం చేస్తున్న జాప్యంపై గాంధేయవాది, సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మండిపడ్డారు. లోక్‌పాల్‌, లోకాయుక్తల
నియామకం కోసం అక్టోబర్‌ 2నుంచి నిరవధిక నిరశన దీక్ష చేపట్టనున్నట్లు అన్నా ప్రకటించారు. లోక్‌పాల్‌ నియామకంపై ప్రధాని మోడీకి అన్నా హజారే ఒక లేఖ రాశారు. గత నాలుగేళ్ల పాలనలో ప్రభుత్వం అనేక పెద్ద పెద్ద హావిూలు చేసిందని, కానీ లోక్‌పాల్‌, లోకాయుక్తలను నియమించలేదని హజారే ఆ లేఖలో పేర్కొన్నారు. 2011 ఆగస్టు 16వ తేదీన దేశవ్యాప్తంగా ప్రజలు లోక్‌పాల్‌, లోకాయుక్తల నియామకం కోసం ఆందోళనలు చేశారని, ఆ ఉద్యమం ఫలితంగానే విూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మోడీకి రాసిన లేఖలో హజారే పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా ఏదో ఒక కారణం చెబుతూ లోక్‌పాల్‌, లోకాయుక్తలను నియమించడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.