లోక కళ్యాణం కోసం రామేశ్వరం నుండి కాశీ వరకు పాదయాత్ర.
నెరడిగొండ జులై27(జనంసాక్షి): సమసమాజంలోని లోక కల్యాణం కోసం రామేశ్వరం నుంచి కాశీ వరకు పాదయాత్ర చేస్తూ నెరడిగొండ మండల కేంద్రంలో బుధవారం రోజున చేరుకున్న స్వాములవారికి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ హిందూ వాహిని కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.అనంతరం వారికి నేరడిగోండ వార్డు సభ్యుడు సాబ్లే సంతోష్ సింగ్ భోజన వసతి కల్పించారు.వారి యాత్ర విజయవంతం కావాలని హిందూ సంస్థల నాయకులు కాంక్షించి వారిని సన్మానించారు.స్వాగతం పలికిన వారిలో రాథోడ్ రాజశేఖర్ బాక్రే శ్రీను బాక్రే లక్ష్మణ్ లింగాల సంతోష్ గౌడ్ సోలంకి సాయి కిరణ్ పొచంపల్లి సాయి తేజ సోలంకి నవీన్ మనోజ్ ప్రణీత్ పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.
