లోతట్టు ప్రాంతాలను పర్యటించి టిఆర్ఎస్ నాయకులు.
జనంసాక్షి న్యూస్ నేరడిగొండ: వర్షాలు తగ్గే వరకు అత్యవసరం తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా గ్రామ ప్రజలకు అనిల్ జాధవ్ అన్నారు.ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని పలు పల్లె ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలు నిలిచిపోయి జనజీవనం స్తంభించాయి. ఇందులో భాగంగా బుధవారం రోజున మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ ఎంపీపీ రాథోడ్ సజన్ మండలంలోని గుత్తాపల మినీ గురుకుల టిడబ్ల్యూయూఆర్జెసి హాస్టల్లో వెళ్లి అక్కడి పరిస్థితిని సమీక్షించారు.విద్యార్థినులు ఎదుర్కొంటున్నా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.వర్షంను లెక్కచేయకుండా అక్కడికి చేరిన అనిల్ జాదవ్ విద్యార్థులకు అధైర్య పడవద్దు నేనున్నా అంటూ ధైర్యం నింపారు.ఆయన వెంట ఎంపీపీ సజన్ ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ డా.జహీర్ఎంపీటీసీ మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.