వంట వార్పుతో నిరసన తెలిపిన మధ్యాహ్న భోజన కార్మికులు.

17వ రోజుకు చేరిన నిరవధిక దీక్షలు.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 6. (జనంసాక్షి) సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె 17వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆర్డీవో కార్యాలయం వద్ద దీక్షా శిబిరం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మధ్యాహ్న భోజన కార్మికులు అంబేద్కర్ చౌరస్తా వద్ద వంట వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పై మండిపడ్డారు. న్యాయమైన కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ మీసం లక్ష్మణ్, పంతం రవి, నాగరాజు, రాజవ్వ, సాయిలు చికెన సత్తయ్య, కిషోర్ పలువురు మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.