వచ్చేది బిజెపి ప్రభుత్వమే..
ప్రజా గోస బిజెపి భరోసా లో
నిజామాబాద్ ఎంపీ అరవింద్…
బేల, జూలై ( జనం సాక్షి ) : రానున్న ఎన్నికల్లో తెలంగాణ లో వచ్చేది బిజెపి ప్రభుత్వమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.మండలము లోని సాంగిడి, బేదోడ, గూడ, మనియార్ పూర్, దహైగాం, కోగ్దూర్, మంగు రూడ్, పాఠాన్, చెప్రాల గ్రామాలలో బుధవారం ప్రజా గోస బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉజ్వల్ యోజన, ఆవాస్ యోజన వంటి అనేక సంక్షేమ పథకాలు బిజెపి ప్రభుత్వం లో అమలు అవుతున్నాయని అన్నారు. వర్షాలతో పంటలు, ఇండ్లు మునిగి పోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం డిల్లీ పర్యటన లు చేస్తున్నారని విమర్శించారు. టిఆర్ఎస్ ప్రభు త్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి పలువురు పార్టీలో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, మండల పార్టీ అధ్యక్షుడు దత్తా నికాం, శివకుమార్, పి నవిన్,కె కృష్ణ, రాము బర్కడే వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Attachments area



