వజ్రోత్సవాల్లో భాగంగా ఆటల పోటీలు.
ఫోటో రైటప్: క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఎంపీపీ.
బెల్లంపల్లి, ఆగస్టు18, (జనంసాక్షి)
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలోని క్రీడా ప్రాంగణంలో గురువారం పాఠశాల విద్యార్థులకు మండల స్థాయి ఆటల పోటీలను ఎంపీపీ రమాదేవి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వతంత్ర భారత దేశం వజ్రోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో విద్యార్థులు ఆటల పోటీల ద్వారా నైపుణ్యం ప్రదర్శించి ప్రథమ స్థానంలో నిలవాలని సూచించారు. ఆటల పోటీల వల్ల విద్యార్థుల్లో మానసిక, శారీరక దృఢత్వం లభిస్తుందన్నారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ భూమేశ్వర్, జడ్పీటీసీ సింగతి శ్యామల, ఎంపీడీఓ వరలక్ష్మీ, ఎస్సై రాజశేఖర్, ఎంఇఓ మహేశ్వర్ రెడ్డి, సర్పంచ్ తోట సుజాత, ఎంపీటీసీ పురంశెట్టి తిరుపతి, మండల కో అప్షన్ సభ్యుడు ఇబ్రహీం, కాంప్లెక్స్ హెచ్ఎం నారాయణ, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.