వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కల నాటి నీరు పోసిన జెడ్పీ టి సి. యం. పి. పి

దోమ న్యూస్ జనం సాక్షి.

భారత 75వ స్వాతంత్ర వజ్రోత్సవ కార్యక్రమాల్లో భాగంగా దోమ మండల పరిధిలోని బొంపల్లి పెద్ద తండాలో ఎంపీపీ అనసూయ జడ్పిటిసి నాగిరెడ్డి బుధవారం మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి మల్లేశం, ఎంపీఓ సోమలింగం, ఏపీఓ దస్తయ్య, ఈసీ చంద్రశేఖర్, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్, నారాయణ రెడ్డి,పంచాయతీ కార్యదర్శి రాజు,స్థానిక సర్పంచ్ తారాబాయి, ఎంపిటిసి రాములు, ఉప సర్పంచ్ రఫిక్ పాష, నాయకులు రాఘవేందర్ రెడ్డి, షఫీ,మాన్య నాయక్, హరి చందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.