వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి.

మల్కాజిగిరి.జనంసాక్షి.సెప్టెంబర్14.
మూడు రోజుల పాటు జరిగే తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవ వేడుకలలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు.బుధవారం ఆనంద్ బాగ్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వజ్రోత్సవ వేడుకల పై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి పోలీస్,రెవెన్యూ,ట్రాఫిక్, ఇంజనీరింగ్,జిహెచ్ఎంసి,విద్యుత్,టౌన్ ప్లానింగ్ అధికారులు హాజరయ్యారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.
ఈనెల 16న ర్యాలీలు,
17న జెండా ఆవిష్కరణ,18న స్వాతంత్ర సమరయోధులకు సన్మాన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.నియోజకవర్గంలో 16న జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్న వారికి జెండాలు అందజేసి ఎలాంటి అపశృతులు జరగకుండా పోలీసులు బందోబస్తులో పాల్గొని సూచనలు సలహాలు చేయాలని,ర్యాలీలో పాల్గొన్న వారికి మంచినీరు,ఆహార పొట్లాలను అందించాలని సూచించారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వజ్రోత్సవ వేడుకలు విజయవంతం చేయాలని సూచించారు.
ఈసమావేశంలో ఏసీపీ నరేష్ రెడ్డి,తహసిల్దార్ వెంకటేశ్వర్లు,డిప్యూటీ కమిషనర్లు రాజు,నాగమణి డిప్యూటీ సిటీ ప్లానర్ గజానంద్,నేరెడ్ మెట్ సిఐ నరసింహ స్వామి,మల్కాజిగిరి సిఐ జగదీశ్వర రావు,ట్రాఫిక్ సీఐ సుధీర్ కృష్ణ,నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.